తెలంగాణ

telangana

ETV Bharat / state

తక్కువ ఖర్చుతో బలవర్ధక ఆహారం: ఐసీడీఎస్ - హనుమకొండ

చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన పోషకాహారంపై మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటుచేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో పోషణ మాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తక్కువ ఖర్చుతో బలవర్ధక ఆహారం తీసుకోవడంపై ఐసీడీఎస్ సీడీపీవో మధురిమ అవగాహన కల్పించారు.

Poshan Masotsav Conducted By ICDS Hanmakonda
తక్కువ ఖర్చుతో బలవర్ధక ఆహారం: ఐసీడీఎస్

By

Published : Oct 1, 2020, 2:22 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషక మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు తీసుకోవాల్సిన పోషకాహార పదార్థాలను స్టాళ్లలో ప్రదర్శించారు. అంగన్వాడీ కార్యకర్తలు కూరగాయలతో చేసిన బతుకమ్మ, పప్పు దినుసులు, పండ్లతో చేసిన పలు ఆకృతులు ఆకట్టున్నాయి.

రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు... ముఖ్యంగా పిల్లల ఎదుగుదల కోసం ఎక్కువ పోషక విలువలు గల ఆహారం తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నామని ఐసీడీఎస్ సీడీపీవో మధురిమ అన్నారు. కరోనాను ఎదుర్కోనేందుకు ప్రతిరోజు పండ్లు, కూరగాయలు తీసుకోవాలని ఆమె సూచించారు. బాలామృతంతో పలు రకాల పోషక విలువలు లభిస్తాయన్నారు.

ఇదీ చూడండి:ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం: సీపీ ప్రమోద్​ కుమార్​

ABOUT THE AUTHOR

...view details