రాష్ట్రంలో రాజకీయంగా కాకరేపుతున్న ప్రధాని ఓరుగల్లు పర్యటన Political Heat in Telangana Over PM Modi Tour : ఎన్నికల ముంగిట వరంగల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనరాష్ట్రంలో రాజకీయ వేడిని మరింత పెంచింది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని.. లక్షలాది కోట్ల రూపాయలు అందించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టేలా ప్రధాని ప్రసంగం ఉంటుందని కిషన్‌రెడ్డి తెలిపారు. అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ సర్కార్ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని విమర్శించారు.
KTR Fires on PM Modi Warangal Tour :తెలంగాణ పుట్టుకను అవమానించి, విభజన హామీలను తుంగలో తొక్కిన ప్రధాని మోదీ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్స్పష్టం చేశారు. గుజరాత్లో 20 వేల కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన మోదీ.. వరంగల్‌లో మాత్రం కేవలం రూ.500 కోట్లు కేటాయించడం దేనికి సంకేతమని కేటీఆర్విమర్శించారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉన్నప్పటికీ.. ఇప్పుడు తూతూమంత్రంగా వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వివక్ష కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తున్న మోదీ.. అభివృద్ధికి అందించిన నిధులు అంతంత మాత్రమేనని మంత్రి ఆరోపించారు.
KTR Comments on PM Modi Tour : బీజేపీ నేతలు మతం పేరుతో చిచ్చు పెట్టి చలి మంటలు కాచుకుంటున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ధరణి వెబ్ సైట్ విదేశీయుల ఆధ్వర్యంలో నడుస్తుందన్న రేవంత్రెడ్డి మాటలపై కేటీఆర్ మండిపడ్డారు. భూ దందాలు చేసే వాళ్లు, ఆక్రమించే వాళ్లు మాత్రమే ధరణిని వ్యతిరేకిస్తున్నారని.. సామాన్య ప్రజలకు ధరణి ఎంతో ఉపయోగపడుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఏ రోజు మోదీని విమర్శించని రేవంత్రెడ్డి.. రాష్ట్రాభివృద్ధిని మాత్రం అడ్డుకుంటున్నాడని తెలిపారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ కనుసన్నల్లో రేవంత్రెడ్డి నడుచుకుంటున్నాడని మంత్రి చెప్పారు. ప్రధాని మోదీ గడిచిన తొమ్మిదేళ్లలో ఓరుగల్లుకి ఏం చేశారో చెప్పాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ప్రధాని పార్టీ కార్యక్రమాల కోసం వస్తున్నాడా? లేక అధికారిక కార్యక్రమాల కోసం వస్తున్నాడా? అన్నది స్పష్టం చేయాలని కోరారు.
Political Heat in Telangana : కేంద్రం ప్రభుత్వం.. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై స్పష్టతనిచ్చాకే..ప్రధాని మోదీవరంగల్ పర్యటనకు రావాలని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ప్రధాని వరంగల్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర విభజన హామీల అమలుపై హనుమకొండలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు.
ఇవీ చదవండి: