నెలలైనా నిండని ఓ ఆడ శిశువును రోడ్డుపై వదిలేసి వెళ్లిన ఘటన వరంగల్ నగరంలో వెలుగు చూసింది. ఎంజీఎం ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద పాప ఏడుపుని గమనించిన ఓ రోగి.. పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. స్పందించిన మట్టెవాడ పోలీసులు.. శిశువును ఆస్పత్రిలోని నవజాత శిశు విభాగానికి తరలించారు. వెంటనే వైద్యులు చికిత్స నిర్వహించడంతో చిన్నారికి ప్రాణాపాయం తప్పింది.
ఆస్పత్రి ఎదుట దీనావస్థలో పసికందు.. కాపాడిన పోలీసులు - an infant at mgm hospital warangal
అభంశుభం తెలియని, నెలలైనా నిండని ఓ పసిపాపను గుర్తు తెలియని వ్యక్తులు నడిరోడ్డుపై వదిలేసిన ఘటన వరంగల్ నగరంలో వెలుగు చూసింది. ఎంజీఎం ఆస్పత్రి వద్ద శిశువును గమనించిన ఓ వ్యక్తి.. పోలీసులకు సమాచారం అందించడంతో పాపకు ప్రాణాపాయం తప్పింది.
ఆస్పత్రి ఎదుట దీనావస్థలో పసికందు.. కాపాడిన పోలీసులు
గుర్తు తెలియని వ్యక్తులు నెలల పాపని రోడ్డుపై పడేయడం బాధాకరమని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పాప పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:ఎలక్ట్రిక్ వాహన హబ్‌గా తెలంగాణ: కేటీఆర్