తెలంగాణ

telangana

ETV Bharat / state

'గణేశ్ నిమజ్జన సమయంలో డీజే అనుమతి లేదు' - police-meet-on-ganesh-navarathrulu

ప్రశాంత వాతావరణం మధ్య గణపతి నవరాత్రులు, మొహర్రం వేడుకలు జరుపుకోవాలని వరంగల్ డీసీపి నరసింహ స్పష్టం చేశారు.

'గణేశ్ నిమజ్జన సమయంలో డీజే అనుమతి లేదు'

By

Published : Aug 29, 2019, 2:11 PM IST

వరంగల్​ జిల్లా రాజశ్రీ గార్డెన్​లో శాంతి కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ డీసీపి నరసింహ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గణపతి మండపాల నిర్వాహకులు, ముస్లిం మత పెద్దలు సమావేశానికి వచ్చారు. నవరాత్రులు నిర్వహించే వారు మైక్ పర్మిషన్, కరెంట్ పర్మిషన్ తీసుకోవాలని డీసీపి సూచించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా మండపాలను ఏర్పాటు చేయాలని తెలియజేశారు. భద్రత దృష్ట్యా వినాయక మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. నిమజ్జనం సమయంలో డీజే అనుమతి లేదని బాణాసంచాను నిషేధించినట్లు డీసీపి వెల్లడించారు.

'గణేశ్ నిమజ్జన సమయంలో డీజే అనుమతి లేదు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details