వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది.
హన్మకొండలోని జిల్లా పోలీస్ హెడ్ క్వాటర్స్‌లో జరిగిన వేడుకల్లో భాగంగా విధినిర్వహణలో అసువులు బాసిన పోలీసు వీరులకు జనగామ జిల్లా డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, పోలీసులు, కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
వరంగల్‌లో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం వరంగల్‌లో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం వరంగల్‌లో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో తమ ప్రాణాలను త్రుణప్రాయంగా త్యజించిన రక్షకభటుల త్యాగాలు మరువలేనివని డీసీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని చెప్పారు. అనంతరం పోలీసులు నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ఆరోగ్యం బాగా లేక ఈఅమరవీరుల దినోత్సవ వేడుకలకు వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ హాజరుకాలేదు.
ఇదీ చూడండి:నిరంతరం విధి నిర్వహణలో పోలీసులు