వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో ఎరువులు, విత్తనాల దుకాణాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న నియంత్రిత పంట సాగు విధానం తీసుకొచ్చిందని, అందుకు అనుగుణంగా రైతులు నకిలీ విత్తనాలు వేసి నష్టపోకుండా ఉండేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. విత్తనాలు, ఎరువుల దుకాణాల యజమానుల లైసెన్సులు పరిశీలించడానికి వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. తనిఖీల్లో నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్టు తెలితే వారి మీద పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
ఎరువుల దుకాణాల్లో పోలీసుల తనిఖీలు - వరంగల్ వార్తలు
వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లోని ఎరువులు, విత్తనాల దుకాణాలల్లో పోలీసులు తనిఖీలు చేశారు. పంట సీజన్ సమయంలో నకిలీ విత్తనాలు, ఎరువులు అడ్డుకోవడానికే తనిఖీలు చేస్తున్నామని ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్ అన్నారు.
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
ఎల్కతుర్తి సర్కిల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జై కిసాన్ వాల్ పోస్టర్లను రూపొందించి ప్రతి గ్రామంలో ప్రదర్శించామన్నారు. రైతులు పోస్టర్లలో ఉన్న సూచనలు చదివి ఏ విత్తనాలు కొనాలో.. సరి చూసుకోవాలన్నారు. రైతులందరూ జై కిసాన్ పోస్టర్‌లోని సూచనలు తప్పకుండా పాటించాలన్నారు.
ఇవీ చూడండి:మీ ఇంట్లోనే కరోనా చికిత్స.. వైరస్ నుంచి బయటపడే మార్గం