వరంగల్ అర్బన్ జిల్లా ఖిల్లా వరంగల్ మండలం పింఛన్ పూర్లో భార్యపై అనుమానం పెంచుకున్న కసాయి భర్త ఆమెను కడతేర్చాడు. జీవిత భాగస్వామి అన్న కనికరం ఏమాత్రం లేకుండా గొంతు నులిమి చంపాడు భర్త ఆయుబ్ ఖాన్.
అనుమానంతో భార్యను కడతేర్చిన పోలీస్ భర్త - రఘునాథ పల్లి పోలీస్ కానిస్టేబుల్
అనుమానమే పెనుభూతమై కట్టుకున్న భార్యను కడతేర్చాడో పోలీస్ కానిస్టేబుల్. ఈ దారుణ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఖిల్లా వరంగల్‌లో చోటు చేసుకుంది.
![అనుమానంతో భార్యను కడతేర్చిన పోలీస్ భర్త అనుమానంతో భార్యను కడతేర్చిన పోలీస్ భర్త](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7518678-thumbnail-3x2-hb.jpg)
అనుమానంతో భార్యను కడతేర్చిన పోలీస్ భర్త
రఘునాథ పల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న అయూబ్.. మామ్నూర్ ఠాణాలో లొంగిపోయాడు. భార్యపై ఉన్న అనుమానం వల్లే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.
ఇవీ చూడండి : భార్యాభర్తల మధ్య గొడవ... మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య