తెలంగాణ

telangana

ETV Bharat / state

కఠినత్వమే కాదు... కష్ట సమయాల్లో కరుణామయులు - LOCK DOWN EFFECTS

నిబంధనల పట్ల కఠినంగా వ్యవహహించటమే కాదు... కష్ట సమయాల్లో కరుణామయులుగా మారి సాయం కూడా చేస్తున్నారు మన పోలీసులు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ... అందరి మన్ననలు పొందుతున్నారు.

POLICE HELP TO NEEDY PEOPLE IN KAJIPET
కఠినత్వమే కాదు... కష్ట సమయాల్లో కరుణామయులు

By

Published : Apr 21, 2020, 2:35 PM IST

విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు... అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేస్తూ ప్రశంసలు కూడా పొందుతున్నారు. ట్విట్టర్ ద్వారా సాయం కోరిన ఓ మహిళకు కాజీపేట పోలీసులు చేయూతనందించారు. లాక్​డౌన్ కారణంగా తల్లిదండ్రులు ఉపాధి కోల్పోయి ఇంట్లో తినడానికి నిత్యావసరాలు కూడా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నీలిమ అనే యువతి మంత్రి కేటీఆర్​ను, వరంగల్ సీపీ రవీందర్​ను ట్విట్టర్ ద్వారా వేడుకుంది.

స్పందించిన సీపీ... కాజీపేట జూబ్లీమార్కెట్​కు చెందిన నీలిమ కుటుంబానికి నిత్యావసరరాలు అందించాలని పోలీసులను ఆదేశించారు. సీఐ నరేందర్, ఎస్సై అశోక్ కుమార్ కలిసి నీలిమ నివాసానికి వెళ్లి నిత్యావసరాలు అందించగా... కృతజ్ఞతలు తెలియజేశారు.

పోలీసు వాహనంలో గర్భిణీని ఆస్పత్రికి తరలింపు

మధ్యప్రదేశ్ నుంచి వచ్చి కాజీపేటలో మేస్త్రీ పనులు చేసుకుంటున్న సూరజ్​ అనే వ్యక్తి... నెలలు నిండిన తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వాహనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. సూరజ్ దంపతుల ఇబ్బందులు గమనించిన పోలీసులు సాయం చేశారు. పోలీసుల వాహనంలోనే హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి గర్భిణీని తరలించారు.

ఇదీ చూడండి..బంతి మెరుపు కోసం ఇకపై ఉమ్మేస్తే కుదరదు

ABOUT THE AUTHOR

...view details