తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​లో అధ్వానంగా రోడ్లు.. ప్రజలకు ఇబ్బందులు - వరంగల్​లో రోడ్ల డ్యామేజీతో ఇబ్బందులు

గ్రేటర్ వరంగల్‌లో రహదారులు అధ్వానంగా మారాయి. గుంతలు, కంకర తేలిన రోడ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హన్మకొండ బస్టాండ్‌ వైపు వెళ్లే దారులన్నీ గుంతల మయం కావడం వల్ల ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి.

వరంగల్​లో అధ్వానంగా రోడ్లు.. ప్రజలకు ఇబ్బందులు
వరంగల్​లో అధ్వానంగా రోడ్లు.. ప్రజలకు ఇబ్బందులు

By

Published : Jun 12, 2020, 3:40 PM IST

వరంగల్‌లో రహదారులు వాహన చోదకులకు చుక్కలు చూపిస్తున్నాయి. కంకర తేలిన రోడ్లు చిన్నపాటి వర్షానికి గుంతల మయంకావడం వల్ల ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ రహదారి పూర్తిగా దెబ్బతిన్నందున.. పరిసర ప్రాంతాల్లోని రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. గుంతల నుంచి వస్తున్న బస్సులు, ఆటోలు ఎటువైపు పడతాయోనని భయం భయంగా ప్రయాణిస్తున్నారు.

గ్రేటర్ వరంగల్ ఆకర్షణీయ నగరంగా ప్రకటించినా... సమస్యలు మాత్రం తీరడం లేదని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే వారు కరవయ్యారని... ప్రజా ప్రతినిధులు ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదని ఆరోపిస్తున్నారు.

రహదారులకు త్వరగా మరమ్మతు చేసి గతుకుల రోడ్ల నుంచి వాహనచోదకులకు విముక్తి కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:సమ్మె విరమించిన గాంధీ జూడాలు

ABOUT THE AUTHOR

...view details