తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజల ఆహ్లాదం కోసమే భద్రకాళి ట్యాంక్​ బండ్' - Bhadrakali Pond Latest News

భద్రకాళి మినీ ట్యాంక్​ బండ్​ను మినీ ట్యాంక్ బండ్​ను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సందర్శించారు. ట్యాంక్ బండ్ అందాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. నగర వాసులకు ఇది మంచి ఆహ్లాదకరంగా ఉంటుందని అన్నారు.

Vinod Kumar
'ప్రజల ఆహ్లాదం కోసమే ఈ భద్రకాళి ట్యాంక్​ బండ్'

By

Published : Oct 7, 2020, 9:10 PM IST

వరంగల్ అర్బన్ కేంద్రంలోని భద్రకాళి చెరువుపై నగర ప్రజల ఆహ్లాదం కోసం చేపట్టిన మినీ ట్యాంక్ బండ్​ను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సందర్శించారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో ప్రభుత్వ చీఫ్ విప్ వినయభాస్కర్, వరంగల్ నగర పాలక కమిషనర్ పమేలా సత్పతితో కలిసి కలియ తిరిగారు.

మినీ ట్యాంక్ బండ్​ను సందర్శించిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్
మినీ ట్యాంక్ బండ్​ను సందర్శించిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్

ట్యాంక్ బండ్ అందాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. నగర వాసులకు ఇది మంచి ఆహ్లాదకరంగా ఉంటుందని అన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో ఇది ఉండ బోతుందని చెప్పారు. కూడా ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ ట్యాంక్ బండ్ జిల్లా ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చి వీక్షించేందుకు అనువుగా ఉందని చెప్పారు. మిగిలిపోయిన చిన్న చిన్న పనులను సత్వరమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.

మినీ ట్యాంక్ బండ్​ను సందర్శించిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్

ఇదీ చూడండి:'సొంత అవసరాలకు బ్యాంకు డబ్బు వాడుకున్న నిందితులు'

ABOUT THE AUTHOR

...view details