ETV Bharat / state
దేవాదుల పైపునకు రంధ్రం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు - devadula pipe leakage
చల్వాయి నుంచి ధర్మసాగర్ చెరువుకు సరఫరా అయ్యే దేవాదుల పైపు లైనుకు గుర్తు తెలియని వ్యక్తులు రంధ్రం చేశారు. పైపు లైను నుంచి భారీగా నీరు వృథాగా పోయింది.
వృథాగా పోతున్న నీరు
By
Published : Mar 31, 2019, 5:37 AM IST
| Updated : Mar 31, 2019, 7:48 AM IST
వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలం ముచ్చర్ల గ్రామ శివారులో దేవాదుల పైపులైనుకు గుర్తు తెలియని వ్యక్తులు రంధ్రం చేశారు. నీరంతా వృథాగా పోయింది. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మోటర్లను ఆపివేసి, నీటి వృథాను అరికట్టే ప్రయత్నం చేశారు. చర్యకు పాల్పడిన వారిపై హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. Last Updated : Mar 31, 2019, 7:48 AM IST