వరంగల్ పట్టణ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురంలో పిడుగు పడి గొర్రెల కాపరి ఫకీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లిలో పిడుగు పడి 32 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల మంద సమీపంలో పిడుగు పడడంతో ప్రమాదం జరిగింది. రాత్రి వేళలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
పిడుగు పడి గొర్రెలు, కాపరి దుర్మరణం - sheeps
పిడుగుపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వరంగల్ పట్టణ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురంలో చోటుచేసుకుంది. అదే మండలంలోని ఒంటి మామిడిపల్లిలో పిడుగు పడి 32 గొర్రెలు చనిపోయాయి.
పిడుగు పడి గొర్రెలు, కాపరి దుర్మరణం
ఇవీ చూడండి: పాదయాత్రగా వెళ్లి.. అనంతలోకాలకు..