BJP meeting Permission cancelled భాజపాకు హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ యాజమాన్యం షాకిచ్చింది. సభకు అనుమతి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 27న ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా ఆర్ట్స్ కాలేజీలో భాజపా భారీ బహిరంగ సభ తలపెట్టింది. ఈ సభకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. ఆయితే ఈ సభకు అనుమతి లేదని కాలేజీ యాజమాన్యం వెల్లడించింది.
భాజపా సభకు అనుమతి రద్దు, అదే కారణమన్న కాలేజీ యాజమాన్యం - Permission denied to BJP meeting
![భాజపా సభకు అనుమతి రద్దు, అదే కారణమన్న కాలేజీ యాజమాన్యం BJP meeting Permission cancelled](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16199132-830-16199132-1661446787750.jpg)
21:57 August 25
భాజపా సభకు అనుమతి రద్దు
భాజపా సభకు పోలీసుల అనుమతి లేదని కాలేజీ యాజమాన్యం తెలిపింది. పోలీసుల పర్మిషన్ లేనందున తాము అనుమతించలేమని వివరించింది. అయితే ఇప్పటికే పోలీసులు అడ్డుకోవడంతో వాయిదా పడిన ప్రజాసంగ్రామ యాత్రకు ఇవాళ హైకోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో భారీ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న భాజపా శ్రేణులు అనుమతి నిరాకరణపై మరోసారి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.
అనుమతి రద్దు చేయడం సరికాదు:సభ ఏర్పాట్లు పూర్తయ్యాక అనుమతి రద్దు చేయడం సరికాదని భాజపా నేత మనోహర్ రెడ్డి అన్నారు. హనుమకొండలో బహిరంగ సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. బహిరంగ సభ అనుమతి కోసం కోర్టును ఆశ్రయిస్తామని మనోహర్‌రెడ్డి వెల్లడించారు.
ఇవీ చదవండి:బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్