లాక్డౌన్ కారణంగా ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ ఖాతాల్లో రూ. 500 జమ చేసింది. అయితే ఆ జమ అయిన డబ్బులు తీసుకునేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత బ్యాంకుల వద్ద బారులు తీరి డబ్బుల కోసం పడిగాపులు కాస్తున్నారు. తాజాగా వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో ఖాతాదారులు మోదీ 500 కోసం ఈ పాట్లు అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాని మోదీ ఇస్తున్న రూ.500 కోసం ప్రజల ఆవేదన - మోదీ 500
లాక్డౌన్ సమయంలోనూ వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలోని బ్యాంకుల వద్ద ప్రజలు బారులుతీరారు. ప్రధాని మోదీ ఇస్తున్న రూ. 500 కోసం తాము ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాని మోదీ ఇస్తున్న రూ.500 కోసం ప్రజల ఆవేదన
ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసినా తమకు డబ్బులు ఇవ్వడం లేదని.. కూలీ చేసుకునే తమకు ఈ 500 రూపాయలు ఎంతో మేలు చేస్తుందని సంతోషపడే లోపే బ్యాంకు అధికారులు ఆ డబ్బులు ఇవ్వడంలో ఇబ్బందులు పెడుతున్నారని ప్రజలు వాపోతున్నారు.
ఇదీ చదవండి:కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక