రాష్ట్రంలో నేటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధించాలన్న ప్రభుత్వ ఆదేశాలపై.. సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీనివల్ల వైరస్ వ్యాప్తి.. పూర్తిగా కాకున్నా, కొంతైనా తగ్గుముఖం పడుతుందని వరంగల్ నగర వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి పూట కర్ఫ్యూ నిర్ణయంపై నగరవాసుల హర్షం - వరంగల్లో కొవిడ్ కేసులు
కొవిడ్ రెండో దశ నేపథ్యంలో రాత్రి పూట కర్ఫ్యూ విధించాలన్న ప్రభుత్వ ఆదేశాలపై.. వరంగల్ నగర వాసులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలందరూ.. నిబంధనలను కచ్చితంగా పాటించినప్పుడే కరోనాను సమూలంగా నిర్మూలించగలమని చెబుతున్నారు.

కొవిడ్ రెండో దశ
ప్రభుత్వాలు ఎన్ని చేసినా.. పౌరుల్లో అవగాహన పెరగాలని అంటున్నారు. కచ్చితంగా నిబంధనలు పాటించినప్పుడే కరోనాను సమూలంగా నిర్మూలించగలమని చెబుతున్నారు.
ఇదీ చదవండి:కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్