తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రమాదాలు జరుగుతున్నాయ్​.. లారీలు ఇటునుంచి రావొద్దు'

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామంలో ప్రజలు ప్రధాన రహదారిని దిగ్బంధించారు. రింగ్ రోడ్డు మీదుగా వెళ్లవలసిన భారీ వాహనాలు గ్రామం మీదుగా వస్తున్నాయన్నారు. తమ గ్రామంలోకి లారీలను అనుమతించబోమంటూ ఆందోళనకు దిగారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు.

people-blocked-the-main-road-in-madikonda-village-in-warangal-urban-district
'ప్రమాదాలు జరుగుతున్నాయ్​.. లారీలు ఇటునుంచి రావొద్దు'

By

Published : Mar 25, 2021, 3:34 PM IST

తమ గ్రామంలోకి లారీలను అనుమతించవద్దంటూ వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామ ప్రజలు ప్రధాన రహదారిని దిగ్బంధించి ఆందోళన నిర్వహించారు. ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రింగ్ రోడ్డు మీదుగా వెళ్లవలసిన భారీ వాహనాలు కేవలం నాలుగైదు కిలోమీటర్ల దూరం తగ్గించుకోవడం కోసం గ్రామం మీదుగా వస్తున్నాయన్నారు.

గతరాత్రి లారీ ఢీకొని ఇదే గ్రామానికి చెందిన హరీశ్​ అనే యువకుడు చనిపోయాడు. ఆ ఘటనపై రాత్రి ఆందోళన నిర్వహించిన గ్రామస్థులు లారీలను గ్రామంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

అయితే ఉదయం నుంచి యథావిధిగా లారీలు వస్తుండడం వల్ల రహదారిపై బైఠాయించి మరోసారి ఆందోళన నిర్వహించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మడికొండ సీఐ రవికుమార్ కొంత సమయం ఇస్తే తగు చర్యలు తీసుకుంటామని ప్రజలకు సర్దిచెప్పడం వల్ల ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి:అప్పులకు బలైన రైతు కుటుంబం.. పరువు కోసం బలవన్మరణం

ABOUT THE AUTHOR

...view details