నిరుద్యోగులను మోసం చేసిన తెరాస ప్రభుత్వానికి.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వరంగల్‌లో పేర్కొన్నారు. హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సదస్సు జరిగింది. ఈ సమావేశానికి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హాజరయ్యారు.
తెరాసకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి - Warangal-Khammam-Nalgonda graduate MLC candidate Ramulu Nayak
వరంగల్ జిల్లాలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలదేనని ఉత్తమ్‌కుమార్ పిలుపునిచ్చారు.
![తెరాసకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెరాసకు ఓట్లు అడిగే హక్కు లేదు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10759636-1011-10759636-1614167838216.jpg)
కాంగ్రెస్ పార్టీ వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్‌ను గెలిపించే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని ఉత్తమ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను తీర్చాలనే ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదని వెల్లడించారు. కేసీఆర్ ఉద్యోగస్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతుకలను తెరాస ప్రభుత్వం మట్టుబెడుతుందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు.
ఇదీ చూడండి: గెలుపు బాధ్యత తెరాస ఎమ్మెల్యేలదే: కేటీఆర్