వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ బస్టాండ్‌లో రద్దీ నెలకొంది. సంక్రాంతి పండుగ సందర్భంగా తమ గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు బస్టాండ్‌కు తరలివచ్చారు.
ప్రయాణికులతో కిటకిటలాడుతున్న హన్మకొండ బస్టాండ్ - కిటకిటలాడుతున్న హన్మకొండ బస్టాండ్
సంక్రాంతి పండుగకు ప్రజలంతా తమ ఊళ్లకు వెళ్తుండటం వల్ల వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది.
హన్మకొండ బస్టాండ్‌లో రద్దీ
ప్రయాణికులు అధిక సంఖ్యలో రావడం వల్ల బస్టాండ్ పరిసరాలు కిటకిటలాడాయి. రద్దీని దృష్టిలో పెట్టుకొని బస్సులను అధిక సంఖ్యలో నడుపుతున్నామని అధికారులు చెబుతున్నా.. అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. బస్సుల కోసం గంటల తరబడి ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.
- ఇదీ చూడండి :ఇళ్లు చేరాలంటే ఈ ఫీట్లు తప్పవు మరి