ఆకాశం మేఘావృతం కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు ఉదయం సూర్యగ్రహణాన్ని వీక్షించలేకపోయారు. 10 గంటలకు కాస్త మబ్బులు తొలగిన అనంతరం.. కొన్ని చోట్ల ప్రజలు సూర్యగ్రహణాన్ని వీక్షించారు. మరి కొంతమంది తమ చరవాణిల్లో గ్రహణ కదలికలను బంధించే ప్రయత్నం చేశారు. జనగామ, మహబూబాబాద్‌లలో పలు చోట్ల పాక్షికంగా సూర్యగ్రహణం కనిపించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని కొన్ని మండలాల్లో ఉదయం చిరుజల్లులు కురిశాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాక్షిక సూర్యగ్రహణం - latest news on Partial Solar Eclipse
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉదయం ఆకాశం మేఘావృతమై ఉండడం వల్ల ప్రజలు సూర్యగ్రహణాన్ని వీక్షించలేకపోయారు. 10 గంటలకు మబ్బులు తొలగిపోయాక పాక్షిక సూర్యగ్రహణం కనిపించింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాక్షిక సూర్యగ్రహణం