తెలంగాణ

telangana

ETV Bharat / state

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి: పార్ట్‌ టైం అధ్యాపకులు - కాకతీయ విశ్వావిద్యాలయం వద్ద పార్ట్​టైం అధ్యాపకుల నిరసన

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో పార్ట్ టైం అధ్యాపకులు ఆందోళన చేపట్టారు. కరోనా పరిస్థితుల వల్ల 3 నెలల నుంచి సరైన వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి: పార్ట్‌ టైం అధ్యాపకులు
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి: పార్ట్‌ టైం అధ్యాపకులు

By

Published : Aug 31, 2020, 8:35 PM IST

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో పార్ట్ టైం అధ్యాపకులు ఆందోళన చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ కేయూ పరిపాలన భవనం ఎదుట నిరసన తెలిపారు. సుప్రీం కోర్టు ఆర్డర్స్‌ను అమలు పరిచి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు.

కరోనా పరిస్థితుల వల్ల 3 నెలల నుంచి సరైన వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పార్ట్ టైం ఆర్డర్స్‌ను ఆటోమేటిక్‌గా ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయాలని కోరారు. వీరికి భాజపా శ్రేణులు మద్దతు పలికారు.

ఇదీ చదవండి:భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ అస్తమయం

ABOUT THE AUTHOR

...view details