వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. దామెర మండలంలోని పలుగ్రామాలకు చెందిన 98 మందికి రూ.95 లక్షల విలువగల చెక్కులు అందజేశారు.
'పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలందిస్తున్నాం' - పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
ప్రజల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు.
'పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలందిస్తున్నాం'
అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టి ఆదర్శవంత రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దని ఎమ్మెల్యే ధర్మారెడ్డి కొనియాడారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేరవేస్తున్న ఏకైక ప్రభుత్వం తెరాస ప్రభుత్వమని పేర్కొన్నారు.
- ఇదీ చూడండి : తొలిసారిగా... సీఎం హోదాలో సీబీఐ కోర్టుకు జగన్