భాజపా శ్రేణులు పేదల సేవను మరచి.. రామ జపం పట్టుకున్నారని వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు. హన్మకొండలోని నివాసంలో.. 128మంది లబ్ధిదారులకు ఆయన కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు.
శ్రీరాముడిని అందరూ పూజిస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భాజపా శ్రేణులు ప్రతిదీ రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమై ప్రధానిని కలిస్తే.. భాజపా నేతలు ఏవేవో పిచ్చి కూతలు కూస్తున్నారంటూ మండిపడ్డారు.