వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. దామెర మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 96 మంది లబ్ధిదారులకు 95 లక్షల 37 వేల రూపాయల విలువ చేసే చెక్కులను అందజేశారు.
రెవెన్యూ బాధలకు చమరగీతం పాడారు: ఎమ్మెల్యే చల్లా - kalyana laxmi latest news
తరతరాలుగా అనుభవిస్తున్న భూసమస్యలకు నూతన రెవెన్యూ చట్టంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చరమగీతం పాడారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
రెవెన్యూ బాధలకు చమరగీతం పాడారు: ఎమ్మెల్యే చల్లా
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టం ద్వారా రైతుల బాధలు తగ్గనున్నాయని చెప్పారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపారని తెలిపారు. పట్టాదారు పాస్బుక్ పొందడంలో అన్నదాతలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చట్టాన్ని రూపొందించారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:నూతన రెవెన్యూ చట్టం ఆరంభం మాత్రమే: కేసీఆర్