నూతన సంవత్సరం వేడుకలు విషాదంగా మారకుండా... ఇంటి వద్దనే ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని పరకాల ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. ప్రస్తుత పరిస్థితులలో దేశం మొత్తం కరోనా మహామ్మరితో పోరాడుతుందని... ఈ నేపథ్యంలో బయట గుంపులు గుంపులుగా తిరగవద్దని తెలిపారు. నిబంధనలు అతిక్రమించి డీజేలు వినియోగిస్తే సీజు చేస్తామని హెచ్చరించారు.
'నిబంధనలు అతిక్రమిస్తే... చర్యలు తప్పవు' - నూతన సంవత్సర వేడుకలు
న్యూ ఇయర్ వేడుకలను సజావుగా జరుపుకునే వారికి పోలీసుల సహకారం ఉంటుందని పరకాల ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంటి వద్దనే ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని సూచించారు.
'నిబంధనలు అతిక్రమిస్తే... చర్యలు తప్పవు'
మద్యం మత్తులో వాహనాలు నడిపి పట్టుబడ్డ వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తామన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని ఏసీపీ తెలిపారు. వేడుకలను సజావుగా జరుపుకునే వారికి తమ సహకారం ఉంటుందని... ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:న్యూ ఇయర్ గిఫ్ట్: బార్లు, క్లబ్బులకు అర్ధరాత్రి వరకు అనుమతి