తెలంగాణ

telangana

ETV Bharat / state

అవసరానికి రాదు... అనవసరమైన వేళల్లో ఏడిపిస్తుంది - nastam

అవసరమైన సమయంలో కర్షకులకు దూరంగా ఉండి... అనవసరమైనప్పుడు వచ్చి నష్టాన్ని మిగిల్చి వెళ్తుంది ఈ వర్షం. వరంగల్​లో నిన్న ఈదురు గాలులతో కురిసిన వర్షం మామిడి, వరి రైతులకు కన్నీటిని మిగిల్చింది.

గాలివానకు నెలకొరిగిన వరి, మామిడి పంటలు

By

Published : Apr 13, 2019, 11:34 AM IST

Updated : Apr 13, 2019, 2:46 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట, ధర్మసాగర్ మండలంలో నిన్న రాత్రి కురిసిన వర్షం రైతన్నలకు నష్టాన్ని మిగిల్చింది. అక్కరకు రాని చుట్టంలా వచ్చి... పంటను నాశనం చేసి వెళ్లింది. అకాల వర్షంతో వరి రైతులకు గింజ మిగలకుండా పోయింది. పొట్టవిప్పే దశలో ఉన్న వరి పైరు ఒరిగిపోయింది. మరికొన్ని చోట్ల కోత దశలో ఉన్న వరి గింజలు రాలిపోయాయి.
మామిడి రైతులు కూడా ఈ గాలి వాన వల్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈదురు గాలుల వల్ల పిందెలు, కాపుకు వస్తున్న కాయలు రాలిపోయాయి. అసలే ఈ యేడు పూత తక్కువగా వచ్చిందని మదనపడుతున్న రైతులకు... ఈ గాలి వాన మరింత నష్టం మిగిల్చింది.

గాలివానకు నెలకొరిగిన వరి, మామిడి పంటలు
Last Updated : Apr 13, 2019, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details