ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన మెచ్చి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు మద్దతు పలికారని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు మానుకోని తెరాస ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. హన్మకొండలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, సుదర్శన్ రెడ్డితో కలిసి ఓటేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
పాలనాతీరు మెచ్చే ఓటేశారు: ఎర్రబెల్లి - panchayati raj minister errabelli dayakar rao speak on mlc result in warangal
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ పాలనాతీరు మెచ్చి తెరాసకు పట్టభద్రులు పట్టం కట్టారని.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు విమర్శలు మానుకుని రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి సహకరించాలని కోరారు.
పాలనాతీరు మెచ్చే ఓటేశారు: ఎర్రబెల్లి
ఈ గెలుపు భాజపా, కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పిందన్నారు. ఇప్పటికైనా భాజపా బుద్ధి తెచ్చుకుని విభజన చట్టంలో పొందుపర్చిన గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని మంత్రి దయాకర్ రావు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:పట్టభద్రులు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: వాణీదేవి