తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమమే తెరాస లక్ష్యం: పల్లా రాజేశ్వర్ రెడ్డి - తెలంగాణ వార్తలు

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. నగరంలోని పలు డివిజన్లలో రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యటించారు. తెరాస అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఓట్ల కోసమే ప్రతిపక్షాలు ప్రజల వద్దకు వస్తాయని అన్నారు.

palla rajeswar reddy elections campaign, warangal elections
వరంగల్ ఎన్నికల ప్రచారంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, వరంగల్ ఎన్నికలు

By

Published : Apr 25, 2021, 9:35 AM IST

అభివృద్ధితో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తెరాసను గెలిపించాలని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు. వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు డివిజన్లలో పర్యటించారు. కాజీపేట్ మండలం మడికొండ గ్రామంలోని 46వ డివిజన్, 64వ డివిజన్ మహిళా కార్పొరేటర్ అభ్యర్థుల తరఫున శనివారం సాయంత్రం ప్రచారం చేశారు.

ఎన్నికల కోసమే ప్రతిపక్షాలు ప్రజల వద్దకు వస్తున్నాయని అన్నారు. తెరాస మేయర్​తోనే నగర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఇంటింటికి తిరుగుతూ డప్పు కొట్టి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరూరి రమేష్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రాష్ట్ర అభివృద్ధికి భాజపా పైసా ఇవ్వలేదు: ఎర్రబెల్లి

ABOUT THE AUTHOR

...view details