తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒక్క పైసా రాకున్నా అభివృద్ధి చేస్తున్నాం: పల్లా - తెలంగాణ వార్తలు

కేంద్రం నుంచి ఒక్క పైసా రాకున్నా.. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఆగట్లేదని వరంగల్​-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్​ రెడ్డి అన్నారు. ఇప్పటికే లక్ష 31 వేల ఉద్యోగాలు ఇచ్చామని వరంగల్​లో అన్నారు.

palla rajeshwar reddy meet the press in warangal urban district
ఒక్క పైసా రాకున్నా అభివృద్ధి చేస్తున్నాం: పల్లా

By

Published : Feb 27, 2021, 4:21 PM IST

రాష్ట్రంలో ఇప్పటికే లక్ష 31 వేల ఉద్యోగాలు ఇచ్చామని వరంగల్​-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్​ రెడ్డి అన్నారు. మరో 60, 70 వేల కొత్త ఉద్యోగాలు భర్తీ కూడా జరుగుతుందని తెలిపారు. కేంద్రం నుంచి ఒక్క పైసా రాకున్నా.. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఆగట్లేదని పేర్కొన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, కొత్త ఉద్యోగాల కల్పన, భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నాయా అని ప్రశ్నించారు.

కేంద్రం.. ప్రభుత్వ సంస్థలను మూసివేస్తోందని.. కానీ తాము తెరిపిస్తున్నామని తెలిపారు. 60 సంవత్సరాల గోస 6 సంవత్సరాల్లోనే పోదని.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పారు. మండలి సమావేశాలకు ఏ ఒక్క రోజు తాను హాజరుకాకుండా లేనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హైదరాబాద్ తరువాత వరంగల్ నగరానికి అధిక ప్రాధ్యాన్యత ఇస్తూ.. అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:నాగార్జునసాగర్ భాజపా నేతలతో బండి భేటీ

ABOUT THE AUTHOR

...view details