వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని పద్మాక్షికాలనీ వాసులు తాగునీటి కోసం ఆందోళన బాట పట్టారు. నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నాకు దిగారు. మిషన్ భగీరథ కోసం తవ్విన గుంతల వల్ల నల్ల పైపులు పగిలిపోయాయని చెప్పారు.
తాగునీటి కోసం పద్మాక్షికాలనీ వాసుల ఆందోళన - etv bharath
మూడు నెలల నుంచి తాగు నీరు రావడం లేదంటూ వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని పద్మాక్షికాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు.
![తాగునీటి కోసం పద్మాక్షికాలనీ వాసుల ఆందోళన తాగునీటి కోసం పద్మాక్షికాలనీ వాసుల ఆందోళన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8831719-990-8831719-1600325439247.jpg)
తాగునీటి కోసం పద్మాక్షికాలనీ వాసుల ఆందోళన
పైపులు పగిలిపోవడం వల్ల మూడు నెలల నుంచి తాగు నీరు రావడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తాగు నీరు సరఫరా చేయకపోతే వరంగల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:1948లో నిజాం రాజ్యం కుప్పకూలిన క్షణమిదే!