ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన సహకార సమరంలో అధికార పక్షమైన తెరాస మద్దతుదారులు జయకేతనం ఎగరేశారు. ప్రత్యర్థి పార్టీలను దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా.... మూడొంతులకుపైగా డైరెక్టర్ పదవులను కైవసం చేసుకున్నారు. సింహభాగం ఛైర్మన్ పీఠాలు తెరాస మద్దతుదారుల పరం కానున్నాయి. ఆరు జిల్లాల్లోనూ కలిపి... 89 సహకార సంఘాలను, 959 డైరెక్టర్ పదవులు గెలుచుకుని.. తెరాస మద్దతుదారులు తమకు తిరుగులేదని నిరూపించారు.
కాంగ్రెస్ మద్దతుదారులు.. 07 సంఘాలు, 240 డైరెక్టర్ల పదవులు గెలుచుకుని... రెండో స్ధానంలో నిలిచారు. భాజపా మద్దతుదారులు 21 డైరెక్టర్ పదవులు గెలుచుకున్నారు. సహకార సంఘాల ఎన్నికల్లో విజయంతో... తెరాస మద్దతుదారుల సంబురాలు అంబరాన్ని తాకాయి. పరస్పరం రంగులు చల్లుకుని... మిఠాయిలు తినిపించుకున్నారు.
సంఘాలు | డైరెక్టర్లు | తెరాస | కాంగ్రెస్ | భాజపా | ఏఐఎఫ్బీ | సీపీఎం | ఇతరులు | |
జయశంకర్ | 10 | 130 | 97 | 17 | 02 | 12 | - | 02 |
మహబూబూబాద్ | 18 | 234 | 186 | 40 | 02 | - | 02 | 04 |
ములుగు | 12 | 156 | 100 | 49 | 01 | - | 03 | 03 |