తెలంగాణ

telangana

ETV Bharat / state

సహకార సంఘాల ఎన్నికల పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తి - telangana primary agriculture co operative society elections

మహబూబాబాద్​ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి ఇందిర తెలిపారు.

pacs election polling arrangements in mahaboobabad district
సహకార సంఘాల ఎన్నికల పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తి

By

Published : Feb 14, 2020, 3:30 PM IST

సహకార సంఘాల ఎన్నికల పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తి

మహబూబాబాద్​ జిల్లాలో సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించి సిబ్బందికి సామగ్రి పంపిణీ చేశారు. జిల్లాలోని 18 సహకార సంఘాల్లో 3 ఏకగ్రీవం కాగా... మిగతా 15 సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయని జిల్లా ఎన్నికల అధికారి ఇందిర తెలిపారు.

రేపు జరగనున్న పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇందిర వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 48వేల 350 మంది రైతులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు.

పోలింగ్​ పూర్తయ్యాక మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఎన్నికల అధికారి ఇందిర పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో జిల్లాలో 500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details