అయోధ్యలో రామమందిర నిర్మాణానికి వృద్ధులు సైతం విరాళాలిచ్చేందుకు ముందుకు వస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట ప్రశాంత్ నగర్‌లోని సహృదయ అనాథ వృద్ధాశ్రమంలోని 78 మంది వృద్ధులు రూ.25 వేల రూపాయల విరాళాన్ని అందించారు. తమకంటూ నా అనేవారు ఎవరూ లేకున్నా.. ప్రభుత్వం నుంచి వస్తున్న వృద్ధాప్య పింఛన్ నగదును జమచేసి రామమందిర నిర్మాణానికి తమవంతుగా సాయం అందిస్తున్నట్లు వారు తెలిపారు.
'మాకు ఎవరూ లేకున్నా మావంతు సాయం చేస్తాం' - వరంగల్ అర్బన్ జిల్లా వార్తలు
అయోధ్య రామమందిర నిర్మాణానికి మేముసైతం సిద్ధమంటున్నారు అనాథ వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధులు. తమకంటూ ఎవరూ లేకున్నా తమవంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని ప్రశాంత్‌నగర్‌లోని సహృదయ అనాథ వృద్ధాశ్రమంలోని వృద్ధులు రూ.25 వేల రూపాయల విరాళమందించారు.
అయోధ్య రామమందిర నిర్మాణానికి రూ.25 వేల విలువైన చెక్కును అందజేస్తున్న వృద్ధులు
మతాలకు అతీతంగా రామరాజ్య స్థాపనకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆశ్రమ నిర్వాహకులు యాకూబీ అన్నారు. దేశ ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని రాముడిని ప్రార్థిస్తున్నట్లు ఆమె తెలిపారు. విరాళాలతో పాటుగా శ్రీరామకోటి రాసిన పుస్తకాలను వరంగల్ అర్బన్ జిల్లా భాజపా అధ్యక్షురాలు రావు పద్మ సమక్షంలో తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులకు అందజేశారు.