సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లే అనేక మంది రోగాల బారిన పడుతున్నారని ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ పేర్కొన్నారు. విచ్చలవిడిగా రసాయనిక ఎరువులను వాడటం వల్ల పంటలు కలుషితం అవుతున్నాయన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో.. బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సేంద్రియ పంటల ఉత్పత్తుల మేళాకు ఆయన హాజరయ్యారు.
ప్రస్తుత కాలంలో.. ప్రజలు సేంద్రీయ కూరగాయల వైపు మొగ్గు చూపుతున్నారన్నారు ఎమ్మెల్యే. రైతులు.. ఆ విషయాన్ని గమనించి, సేంద్రీయ పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు. రైతన్నలకు.. సేంద్రీయ వ్యవసాయంపై శిక్షణ, అవగాహన సదస్సులు, విజ్ఞాన యాత్రలు మొదలగు వాటి ద్వారా ప్రోత్సాహాన్ని అందిస్తున్న బాల వికాస సంస్థను ఆయన కొనియాడారు.