Organ Donation In Telangana : అన్ని జన్మల్లో.. మానవ జన్మ ఉత్తమమని.. కారణం మానవుడు వివేకంతో నిర్ణయాలు తీసుకోగలడు కాబట్టి. తోటి వారికి సాయంగా ఉండగలడు కాబట్టి. కానీ, అవయవ దానం(Organ Donation) విషయంలో అది జరగడం లేదంటున్నారు నిపుణులు. అవయవ దానం విషయంలో మనిషి ఇంకా వెనకడుగు వేస్తూనే ఉన్నాడు. మూఢనమ్మకాలనే చట్రంలో ఇరుక్కుపోయి.. ఈ గొప్ప పనికి నిరాసక్తత చూపుతున్నాడు. ఫలితంగా అవయవాలు దొరక్క.. దుర్భరంగా జీవిస్తున్న వారెందరో. మనం జీవించి ఉన్నప్పుడు అవయవాలు ఇమ్మని ఎవరూ అడిగారు. మరణించిన తర్వాత మట్టిలో కలసిపోయే వాటినే దానంగా ఇమ్మంటున్నారు.
కానీ, అది కూడా చాలా మంది పట్టించుకోవడం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన 99వ మన్ కీ బాత్‌లో అవయవ దానంపై ప్రస్తావించారు. ఈ దానానికి చేయడానికి ముందుకొచ్చి తోటి వారి ప్రాణాలు రక్షించడానికి కృషిచేయాలని దేశప్రజలకు పిలుపునిచ్చారు. 2013లో 5000లోపు అవయవాలు దానంచేయగా, 2022 నాటికి ఈ సంఖ్య 15 వేలకు పెరిగిందని ప్రధాని తెలిపారు. ఈ దానానికి ముందుకొచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు 42 రోజుల ప్రత్యేక సాధారణ సెలవులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం అవయవ దానంపై ప్రభుత్వ పరంగా జీవన్‌దాన్ సంస్థ పనిచేస్తోంది.
Organ Donation In Warangal : మనిషి జీవితం ఎంత కాలమో.. ఎవ్వరూ చెప్పలేరు. పుట్టుట ఎంత నిజమో చావు కూడా అంతే నిజం. కానీ, మరణించిన తర్వాత కూడా చిరంజీవులుగా ఉండాలంటే దానికి ఏకైక మార్గం అవయవ దానం. మరణించిన మనిషి తన శరీరంలోని కళ్లు, కాలేయం, గుండె. మూత్రపిండాలు, ఊపిరితిత్తులు మొదలైన అవయవాలు దానం చేయవచ్చు. ఒక వ్యక్తి సగటున 8 మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అవయవ దానంపై అవగాహన పెంచడంలో దేశవ్యాప్తంగా తెలంగాణ ముందంజలో ఉంది. ఇందుకు తెలంగాణ నేత్ర, శరీర, అవయవ దాతలు అసోసియేషన్ 9 ఏళ్లుగా కృషి చేస్తోంది.
తనువు చాలించి.. ఏడుగురికి ప్రాణదాతగా నిలిచిన స్టేజ్ ఆర్టిస్ట్
Jeevandan Organization Promotes Organ Donation : వరంగల్ జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే అవయవ దానంపై క్రమంగా అవగాహన పెరుగుతోంది. దీంతో అవయవదానం చేయడానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. వరంగల్‌లో ఇప్పటివరకు 117 మంది తమ శరీరారాలను దానం చేయగా.. 690 మంది మరణానంతరం దానం చేయడానికి అంగీకార పత్రం అందించారు. 182 మంది నేత్రాలను దానం చేయగా.. 890 మంది మరణించిన తర్వాత దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఇక జీవన్ మృతులైన తర్వాత అవయవాలు దానం చేసిన వారు 55 మంది కాగా.. 560 మంది తమ అంగీకార పత్రం అవయవ దాతల అసోసియేషన్‌కు అందించారు.