వరంగల్ నగరంలో 'ఒరేయ్ బుజ్జిగా' సినిమా యూనిట్ సందడి చేసింది. వరంగల్ పట్టణ జిల్లా కాజీపేటలోని తాళ్ల పద్మావతి ఇంజినీరింగ్ కళాశాలలో పల్స్-2020 కార్యక్రమానికి సినిమా టీం హాజరైంది. అందులో భాగంగా కళాశాల విద్యార్థులు పలు సాంస్కృతిక నృత్యాలు చేశారు.
సందడి చేసిన 'ఒరేయ్ బుజ్జిగా' సినిమా బృందం - warangal
కాజీపేటలో 'ఒరేయ్ బుజ్జిగా' సినిమా యూనిట్ సందడి చేసింది. తాళ్ల పద్మావతి ఇంజినీరింగ్ కళాశాలలో పల్స్-2020 కార్యక్రమానికి సినిమా బృందం హాజరై పలు పాటలకు నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు.
సందడి చేసిన 'ఒరేయ్ బుజ్జిగా' సినిమా బృందం
కథానాయకుడు రాజ్ తరుణ్, నటి సిరి వరంగల్‌కి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమ సినిమాను చూసి ఆదరించాలని కోరారు. సినిమా బృందం పలు పాటలకు చిందులు వేసి విద్యార్థులను అలరించారు. బృందం చిందులకు అనుగుణంగా విద్యార్థులు కేరింతలు కొడుతూ ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో హీరో రాజ్ తరుణ్, నటీనటులు మధు, సిరి, సినిమా దర్శక నిర్మాతలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :గొర్రెల పంపిణీలో జాప్యం.. 16న రోడ్ల దిగ్బంధనం