ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో యాజమాన్య కోటా కింద ప్రవేశానికి ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. ఈ నెల 25 నుంచి 28 వరకు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఓయూ ప్రాంగణంలోని ప్రొ.రాంరెడ్డి దూరవిద్య కేంద్రంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ధ్రువపత్రాల పరిశీలన, ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని తెలిపారు. పూర్తి వివరాల కోసం వర్సిటీ వెబ్‌సైట్ http://knruhs.telangana.gov.in/లో సంప్రదించాలని సూచించారు.
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ - కాళోజీ నారాయణరావు
యాజమాన్య కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. ర్యాంకుల వారీగా కేటాయించిన తేదీ, సమయాల్లో అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుందని వివరించారు.
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 25 నుంచి 28 వరకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్
ఇవీ చూడండి : వెట్టిచాకిరిలో మగ్గుతున్న బాలలకు విముక్తి