ఆన్లైన్ ద్వారా పెద్ద మొత్తంలో గంజాయి వ్యాపారానికి పాల్పడుతున్న ముఠా సభ్యులను వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 30 లక్షల విలువగల 150 కిలోల శుద్ధి చేసిన గంజాయిని... రెండు కార్లు, 4 చరవాణులను స్వాధీనం చేసుకున్నమని వరంగల్ సీపీ రవీందర్ తెలిపారు. ఈ నలుగురు సభ్యులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి అవసరమున్న వారికి చరవాణి ద్వారా ఆర్డర్లు తీసుకొని పెద్ద మొత్తంలో సరఫరా చేసేవారని తెలిపారు. గతంలో వీళ్లు పలు దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉన్నారని సీపీ వెల్లడించారు.
ఆన్లైన్ గంజాయి ముఠా గుట్టురట్టు - ఆన్లైన్ గంజాయి ముఠా గుట్టురట్టు
డబ్బును సులువుగా సంపాదించేందుకు నలుగురు ముఠాగా ఏర్పడ్డారు. ఆన్లైన్లో గంజాయిని అమ్మకానికి తెరలేపారు. వరంగల్ పోలీసులు చిక్కి బుక్కయ్యారు.

ఆన్లైన్ గంజాయి ముఠా గుట్టురట్టు