వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండలో మేడారం శ్రీసమ్మక్క సారాలమ్మ జాతర హుండీల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మూడు రోజుల నాటికి హుండీల ఆదాయం రూ. 5 కోట్లు దాటింది. మొత్తం 494 హుండీలు ఉండగా.. ఇప్పటి వరకు 194 హుండీలను లెక్కించారు.
కొనసాగుతున్న మేడారం హుండీల లెక్కింపు ప్రక్రియ - warangal urban district today news
మేడారం శ్రీసమ్మక్క సారాలమ్మ జాతర హుండీల లెక్కింపు ప్రక్రియ హన్మకొండలో కొనసాగుతుంది. మూడు రోజుల నాటికి హుండీల ఆదాయం రూ. 5 కోట్లకు చేరింది. మొత్తం 494 హుండీలు ఉండగా, ఇప్పటి వరకు 194 హుండీల లెక్కింపు పూర్తి చేశారు.
కొనసాగుతున్న మేడారం హుండీల లెక్కింపు ప్రక్రియ
భక్తులు సమర్పించిన వెండి నాణేలతోపాటు విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు హుండీలో లభించాయి. గత జాతర ఆదాయం రూ. 10 కోట్లు రాగా.. ఈసారి 10 కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 200 మంది సిబ్బంది సీసీ కెమెరాల నిఘాలో హుండీలును లెక్కిస్తున్నారు.
ఇదీ చూడండి :దొంగ ఓట్లు వేస్తున్నారని ఆందోళన