వరంగల్ అర్బన్ జిల్లాలో తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు వెలుగుచూసింది. వేలేరు మండలం.. ఎర్రబెల్లి తండాకు చెందిన 13 సంవత్సరాల బాలుడికి పాజిటివ్ వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లలితాదేవి తెలిపారు. వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం గాంధీకి తరలించినట్లు ఓ ప్రకటనలో తెలియజేశారు. నాలుగు రోజుల క్రితం వడ్డేపల్లి సమీపంలోని పూరిగుట్టలో వెలుగుచూసిన పాజిటివ్ కేసుకు సంబంధించిన ప్రైమరీ కాంటాక్టుల్లో.. ఈ బాలుడు కూడా ఉన్నట్లు లలితా దేవి తెలిపారు.
వరంగల్లో మరో కరోనా కేసు నమోదు - వరంగల్లో కరోనా కేసులు తాజా వార్త
మరో కరోనా కేసు నమోదవడం వల్ల వరంగల్ అర్బన్ జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. పాజిటివ్ కేసు నమోదైన ఎర్రబెల్లి ప్రాంతాన్ని కంటైన్మెంట్గా ప్రకటించి.. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు చేపడుతున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లలితాదేవి తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఎర్రబెల్లి ప్రాంతాన్ని కంటైన్మెంట్గా ప్రకటిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ ప్రాంతంలోని ప్రజలెవరూ ఇళ్లు వదిలి బయటకు రాకూడదని సూచించారు. రేపటి నుంచి ఈ ప్రాంతంలో వైద్య బృందాలు ఇంటింటీ సర్వే చేపడతాయని దీనితో పాటుగా ఇతర అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు... వైద్య ఆరోగ్య శాఖ అధికారి పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకూ జిల్లాకు చెందిన 20 మంది పాజిటవ్ కేసులు గాంధీ నుంచి డిశ్చార్జ్ కాగా... తాజా కేసుతో కలిపి... మొత్తం ఏడుగురు గాంధీలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి :ఆర్టీసీపై తీవ్రంగా పడిన కరోనా ప్రభావం