తెలంగాణ

telangana

ETV Bharat / state

భారీ వర్షాలకు కుప్పకూలిన పురాతన భవనం - Warangal updates

వరంగల్ నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి పురాతన భవనం రెయిలింగ్ కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి. అధికారులు పాత భవనాలకు నోటీసులు అందించి తూతూ మంత్రంగా చేతులు దులుపుకుంటున్నారని నగర వాసులు మండిపడ్డారు.

oldest building collapsed in Warangal Chowrasta
కుప్పకూలిన పురాతన భవనం

By

Published : Jul 6, 2020, 7:27 PM IST

వరంగల్ నగరంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వరంగల్ చౌరస్తాలోని పాత భవనం రెయిలింగ్ కుప్పకూలింది. భవనం కూలి నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన 108 సహాయంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

వర్షాకాలంలో తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ.. వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులకు మాత్రం చలనం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరిగిన మరుసటి రోజు హడావుడి చేసే అధికారులు.. పాత భవనాలకు నోటీసులు అందించి తూతూ మంత్రంగా చేతులు దులుపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారుల తీరుపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండీ:రానున్న మూడు రోజులు మెరుపులతో కూడిన వర్షం

ABOUT THE AUTHOR

...view details