మేడారం జాతరకు భక్తులు ఉన్న ప్రతి చోట బస్సులు ఉండేలా ఏర్పాటు చేస్తున్నట్లు వరంగల్ ఆర్టీసీ ఆర్ఎం శ్రీధర్ తెలిపారు. దీనితో భక్తులు ఎక్కువగా వస్తారని పేర్కొన్నారు. మొత్తం 51 ప్రాంతాలనుంచి.. నాలుగు వేలకు పైగా బస్సులు నడుపుతామని.. 12 వేల మంది ఆర్టీసీ సిబ్బంది జాతర విధుల్లో పాల్గొంటారన్నారు.
బస్సుల మరమ్మతులపైన కూడా ప్రత్యేక దృష్టి సారించామని ఆర్ఎం శ్రీధర్ తెలిపారు. జాతరకు రెండు నెలల సమయం ఉందని, సమ్మక్క, సారలమ్మ గద్దెల సమీపంలో... బస్టాండ్ నిర్మాణం కూడా చేపడుతున్నామన్నారు. పూర్తి స్థాయిలో శుక్రవారం నుంచి ప్రారంభిస్తామని వెల్లడించారు.