వరంగల్ అర్బన్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని షరీఫ్, కల్లెడ, రాపూర్, ఇస్వాత్ తండా, సీకే తండా, రోళ్లకల్ గ్రామాల్లో కోతుల ఆహారం కోసం ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయడానికి పర్వతగిరి మండల రెవిన్యూ అధికారులు స్థల పరిశీలన చేశారు. ఆయా గ్రామాల్లో మంకీ ఫుడ్ కోర్టు, విలేజ్ పార్కుల కోసం స్థల పరిశీలన చేసినట్లు తహశీల్దార్ మహబూబ్ అలీ, ఎంపీడీవో సంతోష్ కుమార్ తెలిపారు.
మంకీ ఫుడ్ కోర్టు కోసం.. స్థలం పరిశీలించిన అధికారులు! - మంకీ ఫుడ్ కోర్టు
గ్రామాల్లో తిరుగుతున్న కోతుల కోసం ఫుడ్ కోర్టు ఏర్పాటుకు అధికారులు స్థల పరిశీలన చేశారు. పర్వతగిరి మండల పరిధిలోని పలు గ్రామాల్లో కోతులు ఆహారం కోసం ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయడానికి అధికారులు నిర్ణయించారు.
![మంకీ ఫుడ్ కోర్టు కోసం.. స్థలం పరిశీలించిన అధికారులు! Officers land verification for monkey food court in parvathagiri mandal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8227501-785-8227501-1596090055018.jpg)
మంకీ ఫుడ్ కోర్టు కోసం.. స్థలం పరిశీలించిన అధికారులు!