ఆన్లైన్లో విద్యుత్ బిల్లులు చెల్లించడం ద్వారా వినియోగదారులకు సమయం ఆదా అవటమే కాకుండా... సౌకర్యవంతంగానూ ఉంటుందని ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ ఆర్ఈసీలోని విద్యుత్ సబ్ స్టేషన్లో ఆన్లైన్లో విద్యుత్ బిల్లుల చెల్లింపుపై వినియోగదారులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రకటనల ద్వారా ఆన్లైన్ చెల్లింపులపై అవగాహన కల్పించినప్పటికీ... ఇప్పటివరకు కేవలం 17 శాతం వినియోగదారులు మాత్రమే సేవలు వినియోగించుకుంటున్నారన్నారు. క్షేత్రస్థాయిలో వినియోగదారులను ప్రత్యక్షంగా కలిసి అవగాహన కల్పించడం కోసం పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం సబ్ స్టేషన్ పరిసరాల్లో వినియోగదారులతో కలిసి పూల మొక్కలు నాటారు.
'ఆన్లైన్ విద్యుత్ చెల్లింపులతో చాలా సమయం ఆదా' - NPDCL CMD ENCOURAGED CONSUMERS FOR ONLINE BILL PAYMENTS
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ ఆర్ఈసీలోని విద్యుత్ సబ్ స్టేషన్లో ఆన్లైన్లో విద్యుత్ బిల్లుల చెల్లింపుపై వినియోగదారులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు పాల్గొన్నారు.
!['ఆన్లైన్ విద్యుత్ చెల్లింపులతో చాలా సమయం ఆదా' NPDCL CMD ENCOURAGED CONSUMERS FOR ONLINE BILL PAYMENTS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5466551-thumbnail-3x2-ppp.jpg)
NPDCL CMD ENCOURAGED CONSUMERS FOR ONLINE BILL PAYMENTS
'ఆన్లైన్ విద్యుత్ చెల్లింపులతో చాలా సమయం ఆదా'