వరంగల్ పార్లమెంటు స్థానానికి ప్రధాన పార్టీ అభ్యర్థుల నామపత్రాలు సక్రమంగానే ఉన్నాయని అధికారులు తేల్చారు. మొత్తం 29 మంది నామినేషన్ దాఖలు చేయగా... పరిశీలనలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 8 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన 21 మంది అభ్యర్థుల నామపత్రాలు సరిగ్గానే ఉన్నాయని తెలిపారు.
వరంగల్లో 8 మంది నామపత్రాల తిరస్కరణ - వరంగల్లో 8 మంది నామపత్రాలు తిరస్కరణ
నిన్నటితో రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇవాళ అధికారులు అభ్యర్థుల నామపత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించారు. మొత్తం 29 మందిలో 8 మంది నామపత్రాలు తిరస్కరణకు గురైనట్లు అధికారులు వెల్లడించారు.
![వరంగల్లో 8 మంది నామపత్రాల తిరస్కరణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2806891-838-d1224e83-c2eb-4ad3-b5e6-6b8ebac009ae.jpg)
వరంగల్లో 8 మంది నామపత్రాలు తిరస్కరణ
Last Updated : Mar 26, 2019, 7:55 PM IST