తెలంగాణ

telangana

ETV Bharat / state

మాస్కులు ధరించకుండానే మార్కెట్​లో తిరుగుతున్న ప్రజలు - వరంగల్ పండ్ల మార్కెట్​లో భారీగా పెరిగిన రద్దీ

వరంగల్ పండ్ల మార్కెట్​కు పెద్ద మొత్తంలో మామిడి తరలి వచ్చింది. క్రయ విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ప్రజలు భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండానే మార్కెట్​లో తిరుగుతున్నారు.

fruit market yard
మాస్కులు ధరించకుండానే మార్కెట్​లో తిరుగుతన్న ప్రజలు

By

Published : May 8, 2020, 1:27 PM IST

వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఖమ్మం-కరీంనగర్ జిల్లాల నుంచి మామిడి రాకతో వరంగల్ అర్బన్ జిల్లా ధర్మారంలోని గిడ్డంగుల ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక పండ్ల మార్కెట్ మామిడి పండ్ల వాహనాలతో కళకళలాడుతుంది. మార్కెట్ యార్డులో భౌతిక దూరం పాటించకుండా గుంపులు, గుంపులుగా మామిడి క్రయ విక్రయాలు జరగడం భయాందోళనకు గురి చేస్తోంది.

మార్కెట్ యార్డులో విచ్చలవిడిగా క్రయ విక్రయాలు చేస్తూ... కనీసం మాస్కులు కూడా ధరించట్లేదు. నిబంధనలను ఉల్లంఘిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ ఉన్న నేపథ్యంలో మార్కెట్​లో ఎలాంటి ఏర్పాట్లు చేశారని ఈటీవీ-భారత్ ప్రతినిధి మార్కెట్ కార్యదర్శి సంగయ్యని వివరణ కోరగా... స్పందించకుండా వెళ్లిపోయారు.

ఇవీ చూడండి: హైదరాబాద్​లోనూ ఆయువు తీసే వాయువులెన్నో?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details