తెలంగాణ

telangana

ETV Bharat / state

'గాలివాన బీభత్సం.. విద్యుత్​ సరఫరాకు అంతరాయం' - HANUMAN TEMPLE

ఈదురు గాలులు వరంగల్ పట్టణ జిల్లాలో పెను నష్టం కలిగించాయి. విద్యుత్ స్తంభాలు విరగడం వల్ల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

ఎగిరి పడిన ఇంటి పైకప్పుగా ఉన్న రేకులు

By

Published : May 12, 2019, 12:27 AM IST

గాలివాన బీభత్సం

వరంగల్ పట్టణ జిల్లా ధర్మసాగర్, వేలేరు మండలాల్లో ఈ రోజు సాయంత్రం కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. వేగంగా వీచిన గాలుల వల్ల చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. వేలేరు మండలం కన్నారం గ్రామంలో ఈదురు గాలుల వల్ల పంట నష్టం జరిగింది. జక్కులు సారయ్య, మద్దిక మల్లయ్యల ఇంటి పైకప్పుగా ఉన్న రేకులు ఎగిరిపోయాయి.
ఇదే గ్రామంలో విద్యుత్ స్తంభం విరిగి పడి హనుమాన్ దేవాలయం ప్రహరి గోడ కూలింది. గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి పడి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటం వల్ల ప్రజలు చీకట్లో గడపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details