కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్లు దండం పెట్టి చెబుతున్నా.. ప్రజలు మాత్రం వినడం లేదు. లాక్డౌన్ పాటించకుండా గుంపులు గుంపులుగా రోడ్లపైకి వస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కుమార్పల్లి మార్కెట్ నగరవాసులతో కిటకిటలాడింది. ఉగాది పండుగ సందర్భంగా వివిధ నిత్యవసరాలను కొనుగోలు చేయడానికి ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చారు.
హన్మకొండ మార్కెట్లలో కనిపించని లాక్డౌన్ నిబంధన - updated news on no lockdown effect at hanmakonda in warangal district
ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ ప్రభావం హన్మకొండలో ఏమాత్రం కనిపించడం లేదు. ప్రజలంతా స్వేచ్ఛగా రోడ్లపై తిరుగుతూ.. ప్రభుత్వ నిర్ణయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.
హన్మకొండలో కనిపించని లాక్డౌన్ ప్రభావం
గుంపులు గుంపులుగా చేరి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. వ్యక్తుల మధ్య సామాజిక దూరం పాటించాలన్న నిబంధననూ పాటించడం లేదు. మాంసం దుకాణాల వద్ద సైతం రద్దీ నెలకొంది. రోజురోజుకూ కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతున్నా.. ప్రజల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు.
ఇదీ చూడండి: 'ఆ నియోజకవర్గంలో ఇప్పటికి ఒక్క కేసు నమోదు కాలేదు'