పేదల పాలిట పెన్నిధిగా.. పెద్దాసుపత్రిగా పేరొందిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని మందుల కొరత వేధిస్తుంది. కుక్క, కోతుల కారణంగా గాయపడ్డ బాధితులంతా ఆస్పత్రి ముందు బారులు తీరుతున్నారు. రెండు మూడు రోజుల నుంచి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ల కోసం ఆసుపత్రి చుట్టూ తిరుగుతుంటే.. వైద్య సిబ్బంది మందుల్లేవంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్త చేస్తున్నారు.
పదిహేను రోజుల నుంచి కొరత:
ఉమ్మడి వరంగల్ జిల్లాలలో చిన్నపిల్లలతో పాటు.. పెద్దవాళ్లు కూడా జంతువుల బారిన పడి రోజూ గాయాలపాలవుతున్నారు. పరకాల, నర్సంపేట, మహబూబూబాద్, పాలకుర్తి, జనగామ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో పదిహేను రోజుల నుంచి వ్యాక్సిన్ కొరత నెలకొంది. బాధితులకు అవసరమైన మేరకు వ్యాక్సిన్ సరఫరా కాకపోవడం వల్ల ప్రైవేటు ఆసుపత్రులకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు.