వరంగల్ నిట్లో వసంతోత్సవం - nit
వరంగల్‌లోని నిట్ విద్యాసంస్థ... ఈనెల 15, 16, 17 తేదీల్లో వసంతోత్సవ వేడుకలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు 64 కళలను పరిచయం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. వేడుకల్లో 10వేల మంది విద్యార్థులు పాల్గొంటారని నిట్ సంచాలకులు తెలిపారు.
వరంగల్ నిట్లో వసంతోత్సవం
విద్యార్థులే నిర్వాహకులుగా... దేశంలోని వైవిధ్యమైన సంస్కృతులను ఒకే వేదిక పైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలోని శిల్పకళ, చిత్రకళ, సూక్ష్మ చిత్రకళ, సంగీతం, నాటకం వంటి భిన్నరంగాలకు చెందిన కళాకారులను ఈ వేడుకలకు ఆహ్వానించి సన్మానించనున్నారు. విద్యార్థులకు ఆహ్లదంతో పాటు వివిధ అంశాలలో ప్రతిభా నైపుణ్యాలను వెలికితీసే విధంగా కార్యక్రమాలు ఉంటాయని నిట్ సంచాలకులు తెలిపారు.