వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం దర్గా ప్రాంతంలో వర్షం కారణంగా నిట్ ప్రహరీ గోడ కూలిపోయింది. గత రెండు రోజులగా కురుస్తున్న వర్షాలతో ప్రహరీ నానడం వల్ల సుమారు 50 మీటర్ల మేర నేలమట్టమయింది.
కూలిన నిట్ ప్రహరీ గోడ... వ్యక్తికి స్వల్ప గాయాలు - వరంగల్ అర్బన్ జిల్లా వార్తలు
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని నిట్ ప్రహరీ గోడ కూలి ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రహరీ గోడ నానడం వల్ల 50 మీటర్ల మేర కూలిపోయింది. గోడ పక్కన పార్కింగ్ చేసిన పలు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి.
neet
ఈ ఘటనలో ప్రహరీ గోడ పక్కన పార్కింగ్ చేసిన పలు ద్విచక్రవాహనాలు ధ్వంసమవడంతో పాటు ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. రహదారి పక్కనే ఉన్న గోడ కూలడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది కలిగింది.
ఇదీ చదవండి :కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటా: మంత్రి పువ్వాడ